వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చెట్లకు ఉన్న ఆకులు పూర్తిగా రాలిపోయి కొత్త చిగురు వస్తుంది.

ముఖ్యంగా చింతచెట్లకు ఆకురాలి కొత్త చిగురు వస్తుంది. ఈ ఆకులతో చాలా మంది కూరలు, పచ్చళ్లు కూడా చేసుకుంటుంటారు. 

చింత చిగురు వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు చింత చిగురు వల్ల ఉపయోగాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

వేసవి కాలంలో దొరికే చింత చిగురుతో చాలా మంది రక రకాల వంటల్లో వేసుకుంటుంటారు. 

ముఖ్యంగా పచ్చడితో పాటు పప్పు కూరల్లో వేసుకుంటుంటారు. చింతచిగురు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

 చింతాకులో విటమిన్ సీ ఉంటుంది. ఇది రేచీకటి, కంటి సమస్యలను దూరం చేస్తుందట. 

చింతచిగురులో యాంటీ ఇన్ ఫ్లా మేటరీ అనే గుణాలు ఉంటాయి. ఇది చర్మ క్యాన్సర్ తో బాధపడేవారికి మంచి ఫలితాలను ఇస్తుంది. 

చింతాకును తీసుకోవడం వల్ల రోగనిరోదక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక సీజన్లలో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటి వాటికి కూడా చింతచిగురు బాగా పని చేస్తుందని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న చింతచిగురును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెబుతున్నారు.

నోట్: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోరకు నిపుణులను సంప్రదించండి