'ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు' అంటారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.
అయితే ఉల్లికాడలు తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న వాదనలో నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అదీ కాక వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయని సూచిస్తున్నారు.
ఉల్లికాడలను కూరల్లో వేసుకుని తింటే.. అందులో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణ స్థాయిలను తగ్గించడానికి, కొవ్వు ఆక్సీకరణను తగ్గిస్తాయి.
అదీ కాక దీనిలో ఉండే విటమిన్-సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
ఉల్లికాడల్లో ఉండే అల్లసిన్ చర్మానికి సంబంధించిన అలెర్జిల నుంచి రక్షణ కల్పిస్తుంది. బాడీలో గ్లూకోజ్ శక్తిని ఇన్ క్రీజ్ చేస్తుంది.
ఉల్లికాడల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ జ్వరానికి, జలుబుకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది.