"ఆరోగ్యమే మహా భాగ్యం" అన్నారు పెద్దలు. ఎన్ని డబ్బులు ఉన్నాగానీ.. వాటిని అనుభవించడానికి ఆరోగ్యం సహకరించకపోతే ఆ డబ్బంతా వృథానే.
అదీ కాక మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల మనం హాస్పటల్ల చుట్టూ తిరుగుతున్నాం.
ఈ రోజుల్లో ప్రధానంగా వినిపిస్తోన్న జబ్బు గుండె జబ్బు. చిన్నా పెద్ద తేడాలేకుండా జనాలు ఈ జబ్బు బారిన పడుతున్నారు.
అదీ కకా గుండె జబ్బు ఉన్న వారు ఏది పడితే.. అది తింటే.. అది మీ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు.
దీనిపై వైద్యనిపుణులు వివరణ ఇస్తూ.. గుండె జబ్బులు ఉన్న వారు ఓట్స్ తినొచ్చు అని చెబుతున్నారు.
ఓట్స్ లో ఉన్న పోషకాల వల్ల రక్తంలో ఉండే క్రొవ్వు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఓట్స్ లో ఉండే ఫైబర్ శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
గుండెకు అవసరమైన ఖనిజాలు ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం లాంటివి ఓట్స్ లో పుష్కలంగా ఉంటాయి.
ఓట్స్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. అదీ కాక మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.
ఓట్స్ లో ఉండే కరిగే ఫైబర్ రోమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. శరీరంలోని ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.