భారతదేశానికి, ఆయుర్వేదానికి వియదీయరాని సంబంధం ఉంది.

తెలుసుకుని వాడుకుంటే ప్రకృతిలో లభించే ప్రతీ చెట్టు, ప్రతీ ఆకు ఓ ఔషధమే.

ప్రకృతిలో లభించే ముఖ్య ఔషధాలలో ఒకటి కలమంద. 

 ఈ కలబందను ఉపయోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మార్కెట్ లో దొరికే చర్మ సౌందర్యాలకు వాడే క్రీముల కంటే అలోవెరా చాలా బెటర్. 

దీనిని వాడటం వల్ల శరీరంపై వచ్చే దురద, మంట వంటి అనేక సమస్యలు దూరం అవుతాయి.

కలబంద గుజ్జును జట్టుకు అప్లై చేయడం ద్వారా వెంట్రుకలు అందంగా తయ్యారు కావడంతో పాటు దానికి లభించాల్సిన పోషణ కూడా లభిస్తుంది.

కలబంద లో ఉండే యాంటీ మైక్రోబియలన్ లక్షణాలు చుండ్రు సమస్యలని దూరం చేస్తాయి.

అలోవెరాను నేచురల్ మాయిశ్చరైజర్ అని చెబుతారు వైద్యులు. 

దీనిని వాడటం వల్ల చర్మం సాఫ్ట్ గా, కోమలంగా మారుతుంది.

కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు మెుటిమలు, ఎగ్జిమా, దురద, సోరియాసిస్ లాంటి సమస్యలు రాకుండా దూరం చేస్తాయి.

అలోవేరా జ్యూస్ ని నోటిలో వేసుకుని పుక్కిలిస్తే.. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు దూరం అవుతాయి. 

ఎందుకంటే దానిలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి.