చాలా మంది పడుకునే ముందు ఫోన్ ఉపయోగిస్తుంటారు. అయితే పడుకునే ముందు ఫోన్ ని పక్కనే పెట్టుకుంటారు.

అయితే ఇలా ఫోన్ పక్కన పెట్టి పడుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

నిద్రపోయే ముందు ఫోన్ చూడడం వల్ల త్వరగా నిద్ర పట్టదు. ఆలస్యంగా లేస్తారు. అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. 

ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఒత్తిడి, స్థూల కాయం, డిప్రెషన్ వంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయి. 

ఫోన్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

రేడియేషన్ కారణంగా కండరాల నొప్పి, తలనొప్పి వస్తుంది.

ఫోన్ ని తల పక్కన పెట్టి పడుకోవడం వల్ల మెదడు దెబ్బ తింటుంది.

ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా అంగస్తంభన లోపం కలుగుతుంది. 

ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ నిద్రకి కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది.

దీని వల్ల నిద్ర లేమి సమస్య తలెత్తుతుంది. కంటి ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. 

బ్రెయిన్ కూడా సరిగా పని చేయదు. 

కాబట్టి పడుకునే ముందు ఫోన్ ని కనీసం 3, 4 అడుగులు దూరంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

పైగా ఫోన్లు పేలిపోయే అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉంచడమే మంచిది.