పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్న పెరుగును తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

కొంత మంది మాత్రం పెరుగులో పంచదారను కలుపుకుని తినడానికి ఇష్టపడుతుంటారు.

నోటికి రుచి కూడా ఉండడంతో లొట్టలేసుకుని ఎక్కువగా తింటుంటారు.

అసలు పెరుగులో పంచదారను కలుపుకుని తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి?

పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

పెరుగులో ఉండే విటమిన్లు, కాల్షియం, ప్రొటిన్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా దోహదపడతాయి. 

 పెరుగులో పంచదార కలుపుకుని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది, తద్వారా ఘగర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

అప్పడప్పుడు పంటి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుందట.

అదే పనిగా రోజూ తింటే మాత్రం.. ఖచ్చితంగా గుండెపోటు జబ్బులు వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE: ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. పూర్తి సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించండి.