ఉసిరి గురించి తెలియని వారు ఉండరు. ఉసిరిని ‘శ్రీ ఫలం’ అని కూడా పిలుస్తారు.. ఇందులో ఎన్నో అద్భుతమైన ఎన్నో ఔషదాలు ఉన్నాయి.

ఉసిరి లో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 

 తల వెంట్రుకలు మొదలు కాలి గోళ్ల వరకు ఉసిరి సర్వరోగ నివారిణి

పూర్వ కాలంలో వనభోజనాలు ఉసిరి చెట్టుకింద చేసేవారు.. ఉసిరి చెట్ల గాలి ఆరోగ్యానికి మంచిదని పెద్దలు అంటారు

ప్రతిరోజూ ఒక్క ఉసిరి కాయ తింటే..  అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.

ఉసిరి కాయ తినడం వల్ల  వీర్యపుష్టి సమృద్దిగా కలుగుతుంది

డయాబెటీస్ ఉన్నవారికి  ఉసిరిలో ఉండే ‘సి’విటమిన్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. 

ఉసిరికాయ, తేనె, కరక కలిపిన చూర్ణాన్ని ఆవు నెయ్యితో తీసుకుంటే మధుమేహానికి చెక్ పెట్టవొచ్చు. 

ఉసిరిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ కారణంగా ఆకలి వేయదు.. దాంతో అధిక బరువుకు చెక్ పెట్టవొచ్చు.

ఉసిరి ప్రతిరోజూ మన డైట్ లో చేర్చితే ఇమ్యూనిటీ పవర్ ఎంతో లభిస్తుంది.

ఉసిరిలో ఉండే పోషకాలు  శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

ఉసిరికాయలో ఉండే క్రోమియం అనే పదార్థం మనిషి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని నిరోధిస్తుంది.