మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆకుకూరలు ప్రతి రోజు మన ఆహారంలో భాగం చేసుకోవాలి.

కానీ చాలమంది.. ఆకుకూరల పేరు చెబితేనే.. ఆమడ దూరం పారిపోతారు.

కానీ వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం.. భోజనంలో భాగంగా ఏదో ఒక ఆకు కూర రోజు తీసుకోవాలని చెబుతారు.

ఇక ఆకుకూరలంటే వెంటనే మనకు తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా.. ఇవే గుర్తుకు వస్తాయి.

కానీ మీకు ఆవాల ఆకు గురించి తెలుసా.. దాన్ని ఎప్పుడైనా చూశారా.. లేదా..

అయితే ఆవాల ఆకులు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పుకుందా.

ఆవాల ఆకుల్లో.. ఫైబర్ , విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఆవాల ఆకుల్లో ఉండే విటమిన్ కె.. గుండెను కాపాడుతుంది. ఎముకల్ని బలంగా చేస్తుంది.

అంతేకాక ఈ ఆకుల్లో ఉండే..  బైల్ యాసిడ్స్.. జీర్ణ సమస్యల్ని పరిష్కరిస్తాయి.

సాధారణంగా ఆవాలు అంటేనే వేడి చేస్తాయి. ఈ ఆకులు కూడా అదే లక్షణాన్ని కలిగి ఉంటాయి.

ఈ ఆకుల వల్ల కలిగే వేడి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది.

సాధారణంగా ఆకుకూరలు తినడం కంటి ఆరోగ్యానికి మంచిది.

అదే విధంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా.. కళ్లను కాపాడటంలో.. ఎంతో బాగా పని చేస్తాయి. దృష్టిలోపాలను సరిచేస్తాయి.

ఆవాల ఆకులతో పరాఠాలు చేసుకోవచ్చు. ఆలూ పరాఠాను ఎలా తయారుచేస్తామో.. అలాగే ఈ ఆకులతో కూడా పరాఠాను తయారు చేసుకోవచ్చు.

ఈ పరాఠాలను రోజూ ఉదయం టిఫిన్‌లా తీసుకుంటే శరీరం చురుగ్గా ఉండి రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు.

వెజిటబుల్ సలాడ్‌లు, రైతాలకు కూడా ఆవాల ఆకులు యాడ్‌ చేసుకోవచ్చు. అలానే గ్రేవీలకు కొద్దిగా ఆవ ఆకులు వేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.