మన దేశంలో చాలా మంది టీ ప్రియులు ఉన్నారు.
కొందరికి ఉదయం కళ్లు తెరిచిన వెంటనే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు.
మరికొందరు ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం, రాత్రిపూట కూడా టీ తాగేస్తారు.
కానీ అందులో కోల్డ్ టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.
అలా టీ తాగడం వల్ల సాధారణ జీవక్రియ కార్యకలాపాల్లో ఆటంకం ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు.
టీ ఎక్కువగా తాగే వ్యక్తులు ఎసిడిటీ, బిపి, మొటిమలు, ఆందోళన, డీహైడ్రేషన్ వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందంట.
అలానే నిద్రలేమి, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువ సార్లు టీని వేడి చేయటం వల్ల అందులో క్యాన్సర్ బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
టీని మళ్లీ వేడి చేస్తే.. అందులో నుండి టానిన్ అనే రసాయనం బయటకు వస్తుంది.
ఈ టానిన్ కారణంగా టీ రుచి చేదుగా మారుతుంది.
టీ తయారుచేసిన 15 నిమిషాల తర్వాత మాత్రమే టీ తాగొచ్చు.
టీ ఆకును ఎక్కువ సార్లు వేడి చేసి తాగుతున్నట్టయితే, అది శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది.
వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు.
అలా చేయడం వలన అజీర్తి, లూజ్ మోషన్, జలుబు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, దంత క్షయం, పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయంట.
చాలా వరకు టీ తాగకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.