మీ చేతి గోర్లను బట్టి మీ ఆరోగ్యాన్ని చెప్తారు కొందరు వైద్యులు. మీ గోర్లు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క.

అయితే గోర్ల మీద మచ్చలను బట్టి శరీరంలోని అవయవాల పనితీరును అనుమానించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

కొంత మందిలో విటమిన్లలోపం వల్ల గోర్లపై మచ్చలు ఏర్పడతాయి. 

ముఖ్యంగా శరీరంలో జింక్, కాల్షియం తక్కువైతే గోర్లపై మచ్చలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అదీ కాక మరికొంత మంది గోర్లపై మచ్చలు ఉంటే.. దానికి కారణం గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ కు సంబంధించిన సమస్యగా గుర్తించాలి.

గోర్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే.. జీర్ణయాశయ వ్యాధులు, అనేక అనారోగ్యాలకు సూచికలుగా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

కొన్ని కొన్ని సార్లు బాడీలోని ప్రోటీన్స్ లోపం వల్ల గోర్లు పెలుసు బారిపోతాయి. అదీ కాక శరీరంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. జుట్టు కూడా ఊడిపోతుంది.

ఇక కొంత మందిలో ఆర్సినిక్ పాయిజనింగ్ వల్ల గోర్లపై మచ్చలు ఏర్పడతాయి.

మచ్చలు పెద్దగా, ఎక్కువగా ఉంటే.. వెంటనే వైద్యులకు చూయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.