చాలామంది ఎప్పుడు చూసినా గోళ్లు కొరుకుతూ ఉంటారు. నిజానికి ఇది చాలా చెడ్డ అలవాటు. వేరేవాళ్లు చూడటానికి కూడా అస్సలు బాగోదు.
మరి గోళ్లు కొరికే చెడు అలవాటు నుంచి బయటపడటానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి.
ఒంట్లో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవాళ్లు... తరుచు గోళ్లు కొరుకుతుంటారు.
మరికొందరు మాత్రం ఊరికే గోళ్లు కొరుకుతుంటారు. అది కాస్త అలవాటుగా మారిపోతుంది.
గోళ్లు కొరకడం అనేది ఓసీడీ లక్షణం కూడా కావొచ్చు.
అలానే ADHD, సెపరేషన్ యాంగ్జయిటీ, టూరేట్స్ సిండ్రోమ్, డిప్రెషన్ ఉన్నవాళ్లు కూడా తెగ గోళ్లు కొరికేస్తుంటారు.
ప్రతిదీ కూడా ఫెర్ఫెక్ట్ గా ఉండాలనుకునేవాళ్లు కూడా గోళ్లను కొరుకుతూ ఉంటారు.
ఫెర్ఫెక్షన్ తో ఉండాలనే ఆలోచనతో ఒత్తిడి, ఆందోళనతో బాధపడతారు.
కాబట్టి వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఒత్తిడిని దూరం చేసుకోండి. తద్వారా ఈ అలవాటు తగ్గుతుంది.
నెయిల్ పాలిష్ ని గోళ్లకు వేయడం వల్ల కూడా గోళ్లు కొరికే అలవాటు పోతుంది.
వెనిగర్ ని గోళ్లకు రాసినా సరే వాటిని కొరక్కుండా ఆపుతారు.