పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా చాలా మందికి గోర్లని కొరికే అలవాటు ఉంటుంది.
అయితే అస్తమానూ గోర్లని కొరకడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గోర్లలో అనేక రకాల హానికారక సూక్ష్మ క్రిములు ఉంటాయి.
నోటితో గోర్లని కొరకడం వల్ల ఆ క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణమవుతాయి.
గోర్లలో ఉండే సాల్మొనెల్లా ఈ కొలి అనే బ్యాక్టీరియా ఉంటుంది.
గోర్లను కొరికే వారికి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గోర్లని కొరకడం వల్ల దవడ ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గోర్లను కొరకడం వల్ల గోర్లలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేస్తుంది.
ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు.
గోర్లను అస్తమానూ కొరకడం వలన డెర్మటో ఫాగియా అనే చర్మ సంబంధిత సమస్య వస్తుంది
ఈ కారణంగా చర్మంపై గాయాలు, నరాలపై ప్రభావం చూపిస్తుంది.
ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే గోర్లని కొరకడం మానేయాలి.
గోర్లని కొరికే అలవాటు నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
చేదు పదార్థాలను గోళ్ళకి పూసుకోవాలి. ఇలా చేస్తే ఆ చేదు వల్ల గోర్లను కొరకాలని అనిపించదు.
నెయిల్ కట్టర్ తో గోర్లను పొట్టిగా ఉండేలా కత్తిరించుకోవాలి.
చేతులకి గ్లౌజులు వేసుకోవడమో లేదంటే గోర్లకి బ్యాండ్ ఎయిడ్ వేసుకోవడమో చేస్తే గోర్లు కొరికే అలవాటు తగ్గుతుంది.
మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రయత్నించండి.