ఈ మధ్యకాలంలో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు.
గతకొన్ని రోజుల నుంచి చాలా మంది పొడి దగ్గుతో బాధ పడుతున్నారు.
పొడి దగ్గు సమస్య ఉంటే పని చేసుకోవడం కూడా కష్టం అవుతుంది.
కొన్ని సార్లు ఎన్ని మందులు వాడినా ఈ పొడి దగ్గు తగ్గదు.
అయితే అలాంటి సమయంలో వంటింటి చిట్కాలు మంచి ఔషధంగా పని చేస్తాయి
ఈ పొడి దగ్గు నుంచి బయట పడేందుకు ఆయుర్వేద నిపుణలు కొన్ని చిట్కాలు చెప్పారు.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, విటమిన్ సీ లు పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మను తీసుకోవడం వలన దగ్గు, జలుబు సమస్యలు తగ్గుతాయి.
తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగి దగ్గును తగ్గించుకోవచ్చు.
పొడి దగ్గు తో బాధపడేవారు పసుపు పాలు తీసుకోవడం మంచిది.
ఆగకుండా దగ్గు వేధిస్తుంటే.. మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
కొద్దిగా అల్లం, సోంపు, పుదీనా ఆకులతో కూడా దగ్గును సమస్యను నివారించవచ్చు.
కొద్దిగా అల్లం, చిటికెడు దాల్చిన చెక్క , కొన్ని లవంగాల పోడులను టీకి జత చేసి టీ తాగితే దగ్గు తగ్గుతుంది.
పై చిట్కాలు కేవలం కొందరు నిపుణులు ఇచ్చిన సలహాలు మాత్రమే.
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి.. సలహాలు తీసుకోవడం ఉత్తమం.