ప్రస్తుత కాలంలో మన ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పోషకాలు, ఒంటికి శక్తినిచ్చే ఆహారం బదులు.. బరువు పెంచే తిండి వైపు మొగ్గు చూపుతున్నాం.

ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడంతో.. నీరసం, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి.

కొందరు ఏ పని చేయకపోయినా ఊరికే అలసిపోతారు.. నీరసంగా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం.

ఇక వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తే.. ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తే.. తరచుగా అనారోగ్యం పాలవుతాం

అయితే మన వంటింట్లో ఉన్న కొన్ని పదార్థాలతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి నిరోధ‌క‌ శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు రోజు పరిగడుపున వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు.

వెల్లుల్లితో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం మ‌నం వెల్లుల్లి పేస్ట్‌ను, తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బల పేస్ట్‌కు.. రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కల‌పాలి.

ఇక ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ప్రతి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి.

ఈ విధంగా వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే.. మీ శరీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు.

ఇలా క్రమం తప్పకుండా తేనె, వెల్లుల్లి మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ బారిన పడకుండా కూడా చూసుకోవచ్చు.

ఇక వెల్లుల్లి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. వెల్లుల్లి.. ర‌క్త‌నాళాలల్లో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించి ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా చేయ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇలా వెల్లుల్లి, తేనె మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇక వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇక వెల్లుల్లికి జీర్ణాశ‌య సంబంధింత ఎలాంటి వ్యాధినైనా త‌గ్గించే శ‌క్తి ఉంది.

అంతేకాక వెల్లుల్లి, తేనె మిశ్ర‌మం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యేరియా తగ్గుతుంది.

తేనె, వెల్లుల్లి మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి సమస్యలను నివారించుకోవ‌చ్చు.

పరిగడుపున వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది.

అలానే కాలేయం ప‌నితీరును పెంచే ర‌సాయ‌నాలు వెల్లుల్లిలో అధికంగా ఉంటాయి.

పైగా వెల్లుల్లిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటివి సమస్యలు దూరమవుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా మోతాదు మించకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ చిట్కా పాటించే ముందు వైద్యుని సలహా తీసుకోవాల్సిందిగా మనవి.