భోజనం చేసే సమయంలో లేదా ఇతర సమయాల్లో ఎక్కిళ్లు వస్తుంటాయి.

అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఎక్కిళ్లు బాగా ఎక్కవగా  వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.

ఎక్కిళ్లు ఎక్కువ అవకుండా తగ్గించుకోవడంలో కొన్ని ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

ఎక్కిళ్ళను తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి.

ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల  ఎక్కిళ్లు నుంచి ఉపశమనం పొందొచ్చు. 

కొద్దిగా నిమ్మరసంలో పంచదార మిక్స్ చేసి తీసుకుంటే వెంటనే ఎక్కిళ్లు నుంచి రిలీఫ్ లభిస్తుంది.

ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే మోకాళ్ళతో చేతులు తాకేందుకు ప్రయత్నం చేయండి

నేల పై కూర్చుని ఇలా ఐదు నిమిషాల పాటు ఉంటే ఎక్కిళ్ల నుంచి రిలీఫ్ ని పొందొచ్చు.

కొన్ని కొన్ని సార్లు పరధ్యానంలో ఉండడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.

.కాబట్టి ఎక్కిళ్లు వచ్చినప్పుడు మన దృష్టిని మళ్లించడం మంచిది.

నిదానంగా మీరు చల్లని నీరు తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.

తేనె తీసుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గేందుకు అవుతుంది.

ఇలా ఈ ఇంటి చిట్కాలతో సులభంగా మనం ఎలా ఎక్కిళ్ళను తగ్గించుకోవచ్చు.