మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత చాలా మందికి నిద్ర రావడం అన్నది సహజం.
ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అంటారేమో అన్న భయం భయంతో అసంతృప్తిగానే నిద్ర పోతాం.
అటు పూర్తిగా నిద్ర పోలేము అలా అని ఆఫీస్ వర్క్ చేయలేము.
కానీ నిద్రపోయామన్న అపకీర్తి మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది.
ఈ సమస్యని అధిగమించాలంటే కొన్ని టిప్స్ ని ఫాలో అయితే చాలు.
ఈ సమస్యని అధిగమించాలంటే కొన్ని టిప్స్ ని ఫాలో అయితే చాలు.
మధ్యాహ్న భోజనంలో మాంసం, వేపుళ్ళు వంటివి తినకపోతే మంచిది.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే కూరగాయలు తినడం వల్ల జీర్ణమవ్వడానికి సమయం పడు
తుంది.
అందుకే తిన్న వెంటనే అలసిపోతారు. ఈ కారణంగా మగతగా, మత్తుగా ఉంటుంది.
ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది.
పాలు, మాంసం, ఛీజ్, నట్స్, బ్రేడ్ వంటి వాటిలో ట్రిప్టోఫాన్ అనబడే అమైనో యాసిడ
్ ఉంటుంది.
కాబట్టి లంచ్ లో ట్రిప్టోఫాన్ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోకపోవడమే మంచిది.
మధ్యాహ్నం లంచ్ లో తేలికగా అరిగే ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకుంటే మత్తు ఉ
ండదు.
నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇక పగటి పూట నిద్ర రాకూడదంటే ముందు రోజు కంటి నిండా న
ిద్ర పోవాలి.
మత్తుగా ఉంటే ఒక 15 నిమిషాలు పవర్ నేప్ వేయాలి. ఇలా చేస్తే మైండ్ రీఫ్రెష్ అయ్
యి, బాడీ రీయాక్టివేట్ అవుతుంది.
రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. లేదంటే తేడాలు వస్తాయి. రాత్రి పూట కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోతే పగలు నిద్
ర రాదు.