చాలా మందికి టీ, కాఫీ తాగనిదే రోజు గడవదు.

అంతగా టీ, కాఫీలు మానవుని జీవితంతో ముడేసుకున్నాయి.

మెగాస్టార్ నటించిన మృగరాజు సినిమాలో చాయ్ పై ఓ పాట కూడా ఉంది.

మరి ఇలాంటి టీ, కాఫీల వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

టీ తేయాకు నుండి ల‌భించే పానీయం. దీనిలో ముఖ్యంగా బి గ్రూప్ విట‌మిన్లు, నియాసిన్, రైబో ఫ్లేవిన్ వంటి పోష‌కాలు ఉంటాయి.

టీ లో ఉండే కెఫీన్ మ‌న‌సును ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది.

టీ తాగ‌డం వల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. అలాగే ర‌క్త‌పోటు రాకుండా తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్త్రీల‌లో రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను టీ త‌గ్గిస్తుందని శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు.

అయితే అతిగా టీ తాగితే దానిలో ఉండే కెఫీన్ వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అలాగే నిద్రలేమి సమస్యతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

టీ ఎక్కువగా తాగే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువట.

టీలో ఉండే రసాయనాల వల్ల అజీర్తి, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు ఎదురౌతాయని వైద్యులు అంటున్నారు.

గ‌ర్భిణీలు టీ, కాఫీ ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. స్త్రీల‌కు ఆరోగ్యప‌రంగా చూస్తే టీ కంటే కాఫీ తాగ‌డమే మంచిద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.