చాలా మంది ఆహారంలో తినే క్రమంలో కరివేపాకు వస్తే వాటిని తినకుండా ఏరి పారేస్తుంటారు.

కానీ, కరివేపాకు తినడం ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

అసలు కరివేపాకు తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

ఈ విషయం అందరికీ తెలుసు.. అయినా సరే తినకుండా దానిని ఏరి పక్కకు పెడుతుంటారు.

కరివేపాకును ఏరిపారేయకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కరివేపాకుకు కొలస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అనేక రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కరివేపాకు కాపాడుతుంది.

ఇందులో మ్యూటజెనిక్ సామర్ధ్యం  ఉండడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తోడ్పాటును అందిస్తుంది.

అతిసారం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా కరివేపాకు సాహయం చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా కరివేపాకు మేలు చేస్తుంది. 

ఇలా ఎన్నో రకాల లాభాలు ఉన్నా కరివేపాకును తీసి పారయకుండా అందరూ తిని ఆరోగ్యంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.