చలికాలంలో కీళ్ల నొప్పులు రావడం అనేది సహజం. 

కొన్ని రకాల ఆహారాలను తింటే ఎముకల బలం పెరిగి.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కొవ్వు చేపలతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. సాల్మన్, మాకరెల్ చేపల్లో ఒమేగా-3 కొవ్వులు, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

ఒమెగా-3 ఆమ్లాల మందులను కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.

వెల్లుల్లిలో డైలీల్ డైసల్ఫైడ్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉమశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అల్లం లేదా శొంఠి కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. టీ లేదా గ్రేవీ కూరల్లో కూడా వీటిని వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అల్లం లేదా శొంఠిని కలుపుకుని తాగితే మంచిది. అల్లం శరీరంలో కీళ్ల మంటను తగ్గిస్తుంది.

వాల్ నట్స్, చియా విత్తనాలు, పైన్, బాదం, అవిసె గింజల్లో మంచి కొవ్వులు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే యాపిల్స్, క్రాన్బెర్రీస్, నేరేడు పండ్లను తినడం వల్ల శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరం రక్షించబడింది.

అలానే కీళ్ల మంటను తగ్గించడానికి ఈ పండ్లు కృషి చేస్తాయి. చెర్రీ పండ్లలో ఆంథోసైనిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కీళ్ల వాపు, కండరాల వాపు తగ్గుతుంది.

చికెన్ లేదా మటన్ ఎముకల సూప్ తాగడం వల్ల మన శరీరంలో ఎముకలు బలంగా తయారవుతాయి. ఈ సూప్ డైలీ తాగడం వల్ల కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి.  

చికెన్, మటన్ ఎముకల్లో ఉండే గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్, అమైనో ఆమ్లాలుఎముకల పెరుగుదలకు సహాయపడతాయి.

ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఓలియోకాంతల్ ఉంటాయి. 

ఇవి కీళ్ల మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను, వైద్యులను సంప్రదించవలసినదిగా మనవి.