ఆడవాళ్లకు ఉన్నవి రెండు చేతులే అయినా.. పది చేతులతో పని చేసినట్టు పని చేస్తుంటారు.

ఒక పక్క అంట్లు తోమాలి, ఇల్లూ, గుమ్మాలు ఊడవాలి, పిల్లలకు లంచ్ తయారు చేయాలి,

పిల్లల్ని రెడీ చేయాలి, భర్తకు కాఫీ పెట్టాలి ఇలా చాలా పనులు చేయాల్సి ఉంటుంది.

తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాల్సిన సందర్భం ఉదయాన్నే ఉంటుంది.

ఈ హడావుడిలో పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతుంటారు.

ఇంకో పని చూసుకుని వచ్చే లోపు పాలన్నీ పొంగిపోతాయి.

అయ్యో దేవుడా.. ఇప్పుడెలా అని తల పట్టుకుంటారు.

ఇక నుంచి మీరు మర్చిపోవడమో, కాస్త ఆలస్యం అవ్వడమో జరిగినా గానీ పాలు పొంగకుండా ఉండాలంటే ఈ చిట్కాను పాటించాల్సిందే.

పాల గిన్నె మీద అడ్డంగా ఒక చెక్క గరిటెను పెడితే పాలు పొంగకుండా ఆ గరిటె అడ్డుకుంటుంది.

మూత పెడితేనే మూతని పైకి నెట్టేసి మరీ పాలు పైకి పొంగుతాయి. అలాంటిది గరిటె అడ్డుపెడితే పాలు పొంగకుండా ఉంటాయా అని మీకు సందేహం రావచ్చు.

కింద మంట పెట్టినప్పుడు.. పాలు ఒక పొరలా పైకి వస్తుంది.

ఆవిరితో కూడిన ఆ పొర చెక్క గరిటెను తాకగానే పొర పగిలిపోతుంది.

చెక్క త్వరగా వేడిని గ్రహించదు కాబట్టి త్వరగా వేడెక్కదు. అందుకే పాలు చెక్క వరకూ వచ్చి ఆగిపోతాయి.

చెక్కని తాకిన తర్వాత బుడగ లాంటి పొర పగిలిపోవడం వల్ల పాలు పొంగకుండా ఉంటాయి.

ఒకసారి ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. మీకే తెలుస్తుంది.