సీజన్లతో సంబంధం లేకుండా.. అందరికి అన్ని వేళలా అందుబాటులో ఉండే పండు అరటి.

దేవతలకు కూడా ఇవి ఎంతో ఇష్టం. ఎంత పెద్ద పూజా కార్య్రమాలు నిర్వహించినా సరే.. అరటి పళ్లను తప్పకుండా నివేదిస్తారు.

చవకగా లభించడమే కాక అరటి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి.

తక్షణం శక్తిని అందించే గుణం వీటి సొంతం. పైగా బరువు పెరుగుతామనే భయం ఉండదు.

అందుకే చాలా మంది తమ ఆహారంలో అరటిపండ్లను భాగం చేసుకుంటారు.

అరటిపండులో ఎన్నో విటమిన్లతో పాటు ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

రోజుకు కనీసం ఒక అరటిపండును ఖచ్చితంగా తినాలని  ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు సూచిస్తుంటారు.

అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చాలా త్వరగా చెడిపోతాయి. కానీ ఈ చిట్కాలను పాటించి.. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.

ఫాయిల్ పేపర్ అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంచాలనుకుంటే.. ఫాయిల్ పేపర్ వాడండి.

దీనిని అరటి పండ్ల కాండం చుట్టూ చుట్టి పెట్టడం వల్ల పండు త్వరగా పాడవకుండా తాజాగా ఉంటాయి. 

హ్యాంగర్.. సాధారణంగా బట్టలను తగిలించడానికి హ్యాంగర్ వాడతారు. కానీ అరటి పండ్లను నిల్వ చేయడం కోసం కూడా దీన్ని వాడొచ్చు.

ఎలా అంటే అరటి పండ్లను హ్యాంగర్కు వేలాడదీయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

విటమిన్ సీ మాత్రలతో.. అరటిపండ్లను తాజాగా ఉంచేందుకు విటమిస్ సీ మాత్రలను వాడొచ్చు.

ఈ మాత్రలను నీటిలో కరిగించి.. అరటి పండ్లను ఆ నీటిలో కాసేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అరటిపండ్లు త్వరగా చెడిపోవు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 

అరటి పండ్లను కవర్లో గానీ, గాలి తగలని ప్రదేశాల్లో కానీ నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే పండ్లు త్వరగా పాడవుతాయి. గాలి తగిలేలా ఉంచితేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 

అలానే అరటి పండ్లను ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు. వీటిని కంటైనర్, బ్యాగ్లలో పెట్టకూడదు. ఇలా చేస్తే త్వరగా పాడవుతాయి.