నెయ్యి.. కొద్దిగా వేడి వేడి అన్నంలో.. ఆవకాయ, పప్పు.. కొద్దిగా నెయ్యి వేసుకుంటే.. నోరూరటం ఖాయం.

సాధారణంగా వంటల్లో నెయ్యిని వాడటం వల్ల మంచి రుచి వస్తుంది. 

అదీ కాక నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నెయ్యిని మోతాదుగా తినడం వల్ల..  మెదడు చూరుకుగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

అలాగే నెయ్యిని రోజూవారి ఆహారంలో తీసుకుంటే.. గుండె, కంటి చూపు, చర్మానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఏ నెయ్యి పడితే.. ఆ నెయ్యి తింటే అనారోగ్యం పాలవడం ఖాయం అంటున్నారు వైద్యులు.

ఇప్పటికే మార్కెట్లో అనేక రకాల నెయ్యి అందుబాటులో ఉంది.

మరి ఆ నెయ్యి స్వచ్ఛమైందా? కాదా తెలుసుకోవాలంటే ఇలా చేయండి.

మీకు నెయ్యి లో కల్తీ జరిగింది అని అనిపిస్తే.. వెంటనే దాన్ని రెండు సార్లు మరిగించి.. ఫ్రిజ్ లో పెట్టండి. 

దాంట్లో పెట్టిన తర్వాత నెయ్యిలో పొరలు వస్తే.. అది కల్తీ నెయ్యిగా మనం నిర్దారించుకోవాలి.

ఇంకా సులభమైన పద్దతి ఏంటంటే? మీ అరచేతిలో ఒక స్ఫూన్ నెయ్యి వేసుకోండి. 

కొద్దిసేపు తర్వాత నెయ్యి కరిగింది అంటే.. అది ప్యూర్ నెయ్యి. గడ్డగా అలాగే ఉంటే అందులో కల్తీ జరిగినట్టే.

మీరు స్టవ్ మీద గిన్నె పెట్టి.. దాంట్లో ఓ స్ఫూన్ నెయ్యి వేయండి. నెయ్యి రంగు గోధుమ కలర్ లోకి మారితే అది కల్తీ లేని నెయ్యిగా మనం గుర్తించాలి.

నెయ్యి పసుపు రంగులోకి మారితే స్వచ్ఛమైనది కాదన్నట్లే.