వాస్తు ప్రకారం ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అని అంటారు.

అలా ఉంటే ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని అంటారు.

కొన్ని వస్తువులు ఉండాల్సిన చోట ఉంటే వల్ల పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. 

పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే సమస్యలనేవి రానే రావు.

వాస్తు అంటే సౌకర్యం కలిగించేది. సమస్యలనేవి లేకుండా మనసుకి ఆహ్లాదం కలగడమే సౌకర్యం.

కొంతమంది తమ ఇళ్ళని శుభ్రం చేసుకోరు. చెత్త అలానే ఉంటుంది. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది.

అదే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. 

ప్రతీ ఇంటికీ ముఖ్యమైంది వెంటిలేషన్. వెలుతురు అనేది ఇంట్లోకి రావాలి. చాలా మంది వెలుతురు రాకుండా కిటికీలు మూసేస్తారు. 

దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పాజిటివ్ వైబ్ కోసం వెలుతురు పడేలా చూసుకోండి. 

ఇంట్లో సువాసన వెదజల్లే వాటిని వాడండి. లెమన్ ఆయిల్ వాడితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

మీకు నచ్చిన ఫ్లేవర్స్ ని వాడుకోవచ్చు.

వాస్తు అంటే అన్ని వస్తువులూ బ్యాలెన్స్డ్ గా ఉండాలి.

ఇంటిని ఎక్కువ ఆర్టిఫిషియల్ వస్తువులతోనే కాకుండా మొక్కలతో కూడా అలంకరిస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. 

మెటల్ వస్తువులు ఎక్కువ ఉన్నట్లయితే మొక్కలతో గానీ, దిండులతో గానీ డెకరేట్ చేస్తే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.    

మరి ఈ చిట్కాలను ఫాలో అయ్యి మనసును ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మార్చుకోండి.