ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంట్లో ఈగలు ఉండటం వల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు,వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

వర్షాకాలంలో ఇండ్లలో కీటకాలు ఎక్కువగా రావడం ప్రారంభిస్తాయి.

అయితే.. కొన్ని చిట్కాల మీరు పూర్తిగా ఈగలను ఇళ్లల్లోకి రాకుండా చేయవచ్చు.

ఇంట్లో నుండి ఈగలను దూరంగా ఉంచడంలో ఉప్పు వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కాబట్టి.. 1 గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి అంతటా పిచికారీ చేయాలి. 

ఔషధ మూలకాలు సమృద్ధిగా ఉన్న తులసి, పుదీనా కూడా ఈగలను వదిలించుకోవడానికి బెస్ట్ ఆప్షన్.

కొన్ని తులసి, పుదీనా ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను నీటిలో కలపడం ద్వారా ద్రావణాన్ని సిద్ధం చేయండి. 

ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో పిచికారీ చేయడం వల్ల ఈగలు ఇంట్లోకి రావు.

ఈగలను వదిలించుకోవాలనుకుంటే, నల్ల మిరియాలు, పాలను ఉపయోగించడం బెస్ట్ ఆప్షన్.

1 గ్లాసు పాలలో 3 టీస్పూన్ల పంచదార, 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి కలపండి.

అప్పుడు ఈగలు పాల వాసన దగ్గరికి వచ్చి ఈ ద్రావణంలో మునిగి చనిపోతాయి.

వీనస్ ఫ్లైట్రాప్ మొక్కను కూడా ఇంటి ఆవరణలో నాటితే వర్షాకాలంలో దోమల బెడద పోతుంది. 

వీనస్ ఫ్లైట్రాప్ ఒక కార్నివోరస్ మొక్క, ఇది కీటకాలను ట్రాప్ చేసి వాటిని తింటుంది

అటువంటి పరిస్థితిలో ఇంట్లో వీనస్ ఫ్లైట్రాప్‌ను ఉంచడం ద్వారా, ఈగలు ఈ మొక్కలో చిక్కుకుని చనిపోతాయి.