కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

కొబ్బరి నూనె కనుబొమ్మలు ఊడిపోకుండా ఆపడమే కాకుండా రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.

ఆముదం నూనెలో ఒక కాటన్ క్లాత్ ను ముంచి కనుబొమ్మలపై బాగా మర్దన చేయాలి.

2 లేదా 3 నిమిషాల పాటు మర్దన చేసి.. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో గాని చన్నీటితో గాని కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

కనుబొమ్మల పెరుగుదలకు ఆలివ్ ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది.

ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా మరిగించి.. దాన్ని కనుబొమ్మలపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

రాత్రి నిద్రపోయే ముందు కనుబొమ్మలపై ఆలివ్ ఆయిల్ రాసి.. ఉదయం లేచిన తర్వాత నీటితో కడగండి.

ఆలివ్ ఆయిల్ కి కొంచెం తేనె కలిపి.. కనుబొమ్మలపై అప్లై చేయచ్చు.

ఉల్లిపాయ రసం జుట్టు రాలే సమస్యను, తెల్ల వెంట్రుకల సమస్యలను తగ్గిస్తుంది.

ఇది కనుబొమ్మలు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయను మిక్సీలో వేసి ఆడించగా వచ్చిన రసాన్ని కనుబొమ్మలపై అప్లై చేయండి.

 గుడ్లలో ఉండే ప్రోటీన్లు కనుబొమ్మలు పెరిగేందుకు బాగా ఉపయోగపడతాయి.

గుడ్డులో ఉండే పసుపు సొనను ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపండి.

పసుపు సొనలో ఒక కాటన్ క్లాత్ ని ముంచి కనుబొమ్మలపై రుద్దితే ఒత్తుగా పెరుగుతాయి.