అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్ముతారు.

అయితే దిగువ మధ్యతరగతి వారు, పేదవారు బంగారం కొనలేరు కదా. మరి వారి పరిస్థితి ఏమిటి?

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు కొన్ని పనులు చేస్తే బంగారం కొంటే వచ్చే ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండి.. అన్నం, ఉప్పు, నెయ్యి, కూరగాయలు, పండ్లు, బట్టలు వంటివి అవసరం ఉన్నవారికి దానం చేయాలి.

ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహం ఉంటుంది.

అలానే దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఏకాక్షి కొబ్బరికాయ తెలుసు కదా, ఒకే ఒక్క కన్ను ఉంటుంది. దీన్ని శ్రీ ఫలం అని కూడా అంటారు. శ్రీ ఫలం అంటే లక్ష్మీదేవి యొక్క ఫలము అని అర్థం.

ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు శివలింగాన్ని ముఖ్యంగా పాదరస శివలింగాన్ని ఇంటికి తీసుకెళ్లి నిష్టగా పూజిస్తే మేలు జరుగుతుందని చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు పై పనులు చేస్తే.. ఆరోజున బంగారం కొంటే వచ్చే ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.

దానధర్మాలు, ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఈరోజున వ్రతం చేసినా, పూజ చేసినా, హోమం నిర్వహించినా సాధారణ రోజుల్లో వచ్చే దానికంటే రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజున పూజకు అనుకూలమైన సమయం ఉదయం 6:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:25 గంటల వరకూ ఉంది. 

ఈ సమయంలో పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతున్నారని చింతించకండి. మంచి మనసుతో ఆ భగవంతుడ్ని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.