చలికాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని రకాల కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
ముల్లంగిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి.
క్యాన్సర్ తో పోరాడే గుణం ముల్లంగిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కామెర్లను కూడా తగ్గించే గుణం ముల్లంగికి ఉంది.
మూత్ర సంబంధిత సమస్యలను తరిమికొట్టేందుకు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు ముల్లంగి బాగా తోడ్పడుతుంది.
బరువు తగ్గేందుకు, జ్వరం తగ్గడానికి ముల్లంగి బాగా పని చేస్తుంది. ఒంటి మీద బొల్లి, తెల్ల మచ్చలు ఉంటే ముల్లంగితో చెక్ పెట్టవచ్చు.
క్యాబేజీ కూరలో షుగర్ లెవల్స్ ను నియంత్రించే గుణాలు ఉన్నాయి.
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు.
కంటి ఆరోగ్యానికి క్యాబేజీ చాలా మంచిది. ఇది కంటి సమస్యలను తొలగిస్తుంది. అలానే కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నిరోధిస్తుంది.
బీట్ రూట్ దుంపలు రక్తపోటు సమస్యని నియంత్రిస్తాయి. చర్మ ఆరోగ్యానికి బీట్ రూట్ బాగా పని చేస్తుంది. బీట్ రూట్ తింటే కీళ్ల సమస్యలు రావు.
కళ్ల ఆరోగ్యానికి క్యారెట్ మంచిది. కంటి చూపును పెంచుతుంది. క్యారెట్ తింటే కంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
క్యారెట్ శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరగకుండా క్యారెట్ అడ్డుకుంటుంది.
చిలగడ దుంపల్లో ఉండే ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఎర్ర క్యాబేజీలో తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.