చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతూంటారు. దానికి కారణం అపరిశుభ్రతే.

అయితే చాలా మంది మా ఇళ్లు చాలా నీట్ గా ఉంచుకుంటాం. 

కానీ మాకు అనారోగ్య సమస్యలు వస్తాయి.. ఎందుకో అర్థం కాదంటారు.

కానీ మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.. ఇళ్లు శుభ్రంగా ఉంటే సరిపోదు. మీ బాత్రూం కూడా నీట్ గా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

 మనిషి అనారోగ్య కారణానికి మూలకారణం బాత్రూం లోని బ్యాక్టీరియానే.

కాబట్టి మీరు బాత్రూంలో అసలు చేయకూడని పన్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి టూత్ బ్రష్ బాత్రూంలోనే పెట్టే అలావాటు ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. 

బ్రష్ బాత్రూంలో పెట్టడం వల్ల ఆ రూమ్ లోని హానికర బ్యాక్టీరియా మెుత్తం బ్రష్ పై చేరుతుంది. దాంతో మీకు ప్రమాదం ఏర్పడ్డట్లే.

అదీ కాక శరీరాన్ని రుద్దుకునే స్క్రబర్ ని కూడా కనీసం వారానికి రెండు సార్లు శుభ్రపరచాలి. 

ఎందుకుంటే దాన్ని మనం ఎప్పుడు బాత్రూంలోనే ఉంచుతాం కాబట్టి.. దానిపై క్రిములు పేరుకునే ప్రమాదాం ఉంది.

ఇక అత్యంత ప్రమాదకరమైంది ఏంటంటే? బాత్రూంలో గంటలు గంటలు సెల్ ఫోన్ వాడటం. ఇది చాలా మంది చేసే పని. 

కానీ మీరు అలా వాడే క్రమంలో హానికరమైన క్రిములు సెల్ ఫోన్ పై చేరి.. మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి.

మరీ ముఖ్యంగా బాత్రూంలోకి చెప్పులు లేకుండా అస్సల్ వెళ్ళొద్దు. మీరు గనక చెప్పులు లేకుండా బాత్రూంలోకి వెళ్లి.. మళ్లి అదే కాళ్లతో ఇంట్లో తిరుగుతారు. దాంతో క్రిములన్ని ఇంట్లోకి ప్రవేశిస్తాయి. 

మీకు చూడడానికి ఇవి చిన్న చిన్నవిగానే కనిపించినప్పటికీ ఆరోగ్యంపై పెను ప్రభావాణ్ణే చూపిస్తాయి. అందుకే ఈ చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోండి.