వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయని ఓ నమ్మకం.

వాస్తును పాటించటం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

చాలా మంది వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం, వస్తువుల అలంకరణ చేస్తుంటారు.

ఇక, హిందువులు ప్రతి రోజూ తులసి మొక్కను పూజించటం సంప్రదాయం.

తులసి మొక్క లో లక్ష్మీదేవి ఉంటుందని హిందులు నమ్ముతారు. 

అందుకని ప్రతి రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయడం చేస్తుంటారు. 

అయితే, తెలియక కొంత మంది తులసి మొక్క వద్ద కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

అలా చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తులసి మొక్క ఉన్న చుట్టుపక్కల చెత్త చెదారం ఉండకూడదు. 

తులసి కోట వుండే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి కి కోపం వస్తుందట.

అలానే చీపురుకట్టను తులసి మొక్క దగ్గర పెట్టకూడదు.

ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనం నిలవదు.. పేదరికం వస్తుంది.

అలాగే తులసి మొక్క దగ్గర చెప్పుల స్టాండ్ కూడా ఉండకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది.