చాలా మంది తమ పెంపుడు కుక్కలకి తాము తినే ఫుడ్ పెడుతుంటారు.
అయితే మనం తినే ఆహారంలో కొన్ని కుక్కలకి హాని చేసేవి కూడా ఉంటాయి.
చాక్లెట్లు ఎక్కువగా తింటే పిల్లలకే కాదు కుక్క పిల్లలకి కూడా ప్రమ
ాదమే.
కుక్కలకు చాక్లెట్లు తినిపిస్తే.. వాటికి వాంతులు, వణుకు, డీహైడ్రే
షన్ సమస్యలు వస్తాయి.
ఉప్పగా ఉండే పదార్థాలు కుక్కలకి పెట్టకూడదు.
ఉప్పులో ఉండే సోడియం కుక్కలను డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది.
దీని వల్ల వాటికి తరచుగా మూత్ర విసర్జన అవుతుంది.
ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినిపించడం వల్ల వాటి శరీర ఉష్ణోగ్రత పెర
ుగుతుంది. మూర్ఛ కూడా వస్తుంది.
ఉల్లి, వెల్లుల్లి మనకి మంచివే కానీ కుక్కలకి కాదు.
ఉల్లి, వెల్లుల్లితో చేసిన ఫుడ్ కుక్కలకి తినిపించడం వల్ల వాటి శరీ
రంలోని ఎర్ర రక్తకణాలు దెబ్బ తింటాయి.
దీని వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
పంది, గొడ్డు, గొర్రె,దూడ మాంసాహారం అస్సలు పెట్టకూడదు.
దీని వల్ల కుక్కలకి క్లోమం వాపు సమస్య వస్తుంది.
కుక్కలకి ఎలాంటి మాంసం పెట్టాలనే విషయంలో నిపుణు
ల సలహా తీసుకోవడం మంచిది.
కుక్కల కోసం ప్రత్యేకించి కుక్కల ఆహరం ఉంటుంది. అది పెడితే కుక్కలు ఆరోగ్
యంగా ఉంటాయి.