మనకు సర్జరీ/ఆపరేషన్ చేసే రోజు.. ఉదయం  నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దని డాక్టర్స్ చెబుతారు.

ఆహారం మాత్రమే కాదు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవద్దని చెబుతారు.

సర్జరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారు.

అలానే ఆపరేషన్ పూర్తయిన తర్వాత వంకాయని అస్సలు తినొద్దని చెబుతారు. దీనికి ఓ కారణం ఉందండోయ్..

సాధారణంగా ఏ డాక్టర్ అయినాసరే సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాని పేషెంట్ కి ఇస్తారు. దీంతో మత్తు ఏర్పడి పేషెంట్ నిద్రపోతాడు.

అయితే ఇలా లోకల్ అనస్తీషియా ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియకు ఆటంకం కలుగులుతుంది.

మన శరీరం ట్రామాలో పడిపోతుంది. అవయవాలు అన్నీ స్తబ్దుగా అయిపోతాయి.

తిరిగి పనిచేయడానికి కాస్త సమయం పడుతుంది.

అలానే ఒంట్లో అనస్తీషియా ఉండటం వల్ల హిస్టమిన్లు విడుదల అవుతూ ఉంటాయి.

 వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్టమిన్ మందులు ఇస్తారు.

ఇకపోతే వంకాయ హిస్టమిన్స్ విడుదల చేసే పదార్థం. యాంటీ హిస్టమిన్ మందులు ఉపయోగిస్తూ వంకాయ తింటే.. ఆ మందులు పనిచేయవు.

అందుకే సర్జరీ తర్వాత కొన్నాళ్లపాటు వంకాయ తినొద్దని డాక్టర్స్ చెబుతుంటారు.

ఒకవేళ మీకు ఈ మధ్య ఆపరేషన్ జరిగితే మాత్రం.. డాక్టర్ ని ఈ విషయం ఓసారి అడిగి చూడండి.