హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి.

చాలా మంది ఎంతో నిష్టగా శివరాత్రి పూజ చేసుకుంటారు. ఉపవాసం ఉంటారు.. జాగారం చేస్తారు.

అయితే శివరాత్రి నాడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.

అలాంటి వాటికి దూరంగా ఉంటూ.. శివ నామస్మరణతో మెలగాలి అంటున్నారు.

శివరాత్రి రోజున ఎవరిని దూషించకూడదని, అక్కరలేని మాటలు మాట్లాడటం చేయకూడదని అంటున్నారు పండితులు.

ఈ పర్వదినం రోజున ఎవరితో వాదులాటకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటూ శివనామ స్మరణలో తరిస్తే మంచిది అంటున్నారు.

ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి ఒక్క రోజును ఆ ఈశ్వరుడికి కేటాయించి ఆయన సేవలో తరిస్తే మంచిది అంటున్నారు.

ఏ పని చేసినా శివ పంచాక్షరిని పఠిస్తూ ఒక యోగంలా గడిపితే మేలని అంటున్నారు.

ఇక మౌనవ్రతం చేస్తే ఎంతో మంచిదని.. కుదరని వాళ్లు.. వీలైనంత వరకు తక్కువ మాట్లాడితే మేలని అంటున్నారు.

ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే శివరాత్రి రోజున ఎలాగోలా వీలు చేసుకుని ఆ ఒక్కరోజున ఉపవాసం, జాగారం చేయడం మేలని అంటున్నారు పండితులు.