ఈ మధ్య కాలంలో వీధి కుక్కల దాడిలో చాలా మంది గాయపడ్డారు.
అంతకముందు నగరంలోని అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ఓ ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి మనం ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు వీధి కుక్కలు వెంటపడుతుంటాయి.
ఆ సమయంలో మనకు ఏం చేయాలో తెలియక వాటి నుంచి రక్షించుకునేందుకు వేగంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటాం.
కానీ, అలా వేగంగా వెళ్లడంతో ఆ కుక్కలు మరింత వేగంగా మన వైపు పరుగుత్తకొచ్చి మనపై దాడి చేస్తుంటాయి.
ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు కుక్కలు వెంటపడకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు రోడ్లపై ఉండే వీధి కుక్కలు వెంటపడుతుంటాయి.
ఆ సమయంలో మనకు ఏం చేయాలో తెలియక మరింత వేగంగా వెళ్తుంటాం. దీంతో ఆ కుక్కలు మరింత వేగంగా మనపై దాడి చేస్తుంటాయి.
అలా కుక్కలు వెంటపడినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
మనం బైక్ పై వెళ్లేటప్పుడు రోడ్డుపై కుక్కలు కనిపించినా, వెంటపడినా బైక్ పై వేగంగా వెళ్లకూడదు.
మనం వేగంగా వెళ్లినప్పుడు కుక్కలు వెంటపడితే.. తొందర పడకుండా బైక్ ని ఆపాలి. దీంతో ఆ కుక్క వెనకడుగు వేస్తుంది.
ఆ కుక్క వెనక్కి జరిగిన తర్వాత వేగంగా వెళ్లకుండా నెమ్మది నెమ్మదిగా వెళ్లి ఆ తర్వాత వేగాన్ని పెంచుకోవచ్చు.
బైక్ పై వెళ్లేటప్పడు కుక్కలు వెంటపడినప్పుడు ఇలా చేస్తే ఆ కుక్కలు మన వెంటపడవు, దాడి చేయవు.