తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ముఖ్య గమనిక. దివ్యదర్శనం టికెట్ల కేటాయింపు సెంటర్ ను టీటీడీ మార్చింది.

ఇంతకుముందు వరకు అలిపిరి నుంచి కాలినడకన కొండ పైకి వచ్చే భక్తులకు గాలి గోపురం వద్ద దివ్యదర్శనం టికెట్లు ఇచ్చేవారు. 

ఇకపై అలిపిరి భూదేవి కాంప్లెక్స్​లో భక్తులకు దివ్యదర్శనం జారీ చేయనున్నారు. 

దర్శనం టోకెన్లను పొందిన భక్తులు అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో వాటిని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

భక్తులు తమ టికెట్లను స్కాన్ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో కొండ పైకి చేరుకున్నా.. శ్రీవారి దర్శనానికి అనుమతించరు. 

శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్లను మాత్రం ఇక మీదట కూడా అక్కడే ఇస్తారు. 

శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులు ఎప్పటిలాగే దివ్యదర్శనం టోకెన్లను 1,240వ మెట్టు దగ్గర తీసుకోవచ్చు. 

టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల (ఎస్​ఎస్​డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు. 

వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు.. తిరుపతిలోనే స్వామి దర్శనానికి సంబంధించిన ఎస్​ఎస్​డీ టోకెన్లను జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది. 

వెహికిల్స్​లో వెళ్లే భక్తుల కోసం తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఎస్​ఎస్​డీ టోకెన్లను అందించే ఏర్పాట్లు చేసింది టీటీడీ.

శ్రీనివాసపురం, ఆర్​టీసీ బస్టాండ్ ఎదురుగా, విష్ణునివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా ఎస్​ఎస్​డీ టోకెన్లను పొందొచ్చు. 

అలాగే గోవిందరాజసత్రాలు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనకాల కూడా ఎస్ఎస్​డీ టోకెన్స్​ను తీసుకోవచ్చని టీటీడీ వివరించింది.