మన ఇంట్లో పెంచుకునే రకరకాల మొక్కల్లో మందార ఒకటి. దీని పువ్వుల గురించి దాదాపు ప్రతిఒక్కరికీ తెలుసు.

మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మందార పువ్వులు దొరుకుతాయి. ఇక మందార ఆకులు, పువ్వుల్లో ఔషద గుణాలు చాలా ఉంటాయి.

మందార ఆకులు, పువ్వులను ఉపయోగించడం వల్ల జట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మందార పూలతో చేసిన ప్యాక్ ల ముఖానికి వేసుకోవడం వల్ల కాంతివంతంగా మారుతుంది.

ఇక మందార పువ్వులతో టీ చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మరి దీన్ని తయారు చేసుకోవడం ఎలానే చూద్దామా?

ముందుగా మూడు మందార పువ్వులని శుభ్రంగా కడగాలి. ఓ గ్లాస్ నీటిని ఓ గిన్నెలో వేడిచేయాలి.

నీళ్లు బాగా మరిగిన తర్వాత మందార పూల రేకులని తీసి దానిలో వేసుకోవాలి. గిన్నెపై మూతపెట్టి 10 నిమిషాలు మరగించాలి.

ఆ తర్వాత టీని వడకట్టి.. ఓ కప్పులోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకోవాలి. కావాలంటే తేనె కూడా మిక్స్ చేయొచ్చు.

ఈ టీని రోజూ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఈ మందార పూలతో చేసిన టీ, వేగంగా తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు తగ్గడంలోనూ ఈ టీ దివ్యఔషధంలా పనిచేస్తుంది. దీని వల్ల కాలేయం కూడా క్లీన్ అవుతుంది.

మలబద్ధకం సమస్య తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి కూడా చాలావరకు మెరుగుపడుతుంది.

అధిక బరువుతో బాధపడేవారు.. ఈ టీ తాగడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. దీని వల్ల క్యాన్సర్ బారిన పడే ఛాన్సులు కూడా తగ్గుతాయి.

బాడీలో హీట్ తో బాధపడేవారికి ఈ టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా మందార పూలతో చేసిన టీ.. మన శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది.

నోట్: పై టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.