నిద్ర సుఖం ఎరగదు.. ఆకలి రుచి ఎరగదు.. అంటారు పెద్దలు.

అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ 6-8 గంటల నిద్ర శరీరానికి అవసరం అని చెబుతారు.

ఎందుకంటే శరీరం నిద్రలోనే రిలాక్స్ అవుతుంది. దాంతో తిరిగి శక్తిని పొందుతుంది.

అయితే నేటి ఆధునిక సమాజంలో సెల్ ఫొన్ వచ్చాక జీవన విధానమే మారిపోయింది.

అదీకాక వయసుతో సంబంధం లేకుండా అందరూ నిద్రలేమితో సతమతమవుతున్నారు.

ఇక నిద్రపొమ్మన్నారు కదా అని ఎలా పడితే అలా పడుకుంటే సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.

మరీ ముఖ్యంగా  బోర్లా పడుకునే వ్యక్తులకు చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొక్క బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతిపైన నొప్పి వస్తుంది.

ఇలా పడుకోవడం వల్ల మన ముఖం దిండుకు అదుముకుంటుంది. దాంతో దిండుకు ఉన్న డస్ట్ మెుత్తం మన ఫేస్ కు అంటుకుంటుంది.

డస్ట్ వల్ల ఫేస్ పై మెుటిమలు, అలర్జి లాంటివి వస్తాయి. తగినంత గాలి తాకక అందమైన ముఖంపై ముడతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గర్భిణులు బోర్లా అస్సలే పడుకోవద్దు అంటారు వైద్యలు. అలా పడుకోవడం వల్ల బిడ్డపై ఒత్తిడి పెరుగుతుంది.

మీకు తెలియని విషయం ఏంటంటే? బోర్లా పడుకుంటే వెన్ను నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కానీ గురక పెట్టేవారికి మాత్రం బోర్లా పడుకోవడవల్ల లాభం ఉందంట.

డాక్టర్లు ఎడమ చేతివైపు తిరిగి నిద్రపోతే చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకుంటే తిన్న తిండి కరెక్ట్ గా జీర్ణం అవుతుందట. దాంతో నిద్ర సరిగ్గా పడుతుంది.