పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నారు.

కొన్నేళ్ల ముందు వరకు అందరి హీరోల్లానే పవన్ కూడా వరసగా సినిమాలు చేస్తూ వచ్చారు.

2019 ఎలక్షన్స్ కోసం దాదాపు రెండేళ్ల పాటు బ్రేక్ తీసుకున్నారు. 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చారు.

గతేడాది ఫిబ్రవరిలో 'భీమ్లా నాయక్'గా వచ్చి ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. ఆ తర్వాత మరో సినిమా రాలేదు.

ప్రస్తుతం పవన్ చేతిలో  హరిహర వీరమల్లు, PKSDT, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఉన్నాయి.

వీటిలో హరిహర షూటింగ్ కాస్త పెండింగ్ లో ఉండగా, PKSDT (వినోదయ సీతం) పవన్ పార్ట్ పూర్తయిపోయింది.

తాజాగా 'ఉస్తాద్..' షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని నెలల్లో OG షూట్ మొదలవుతుంది.

వీటి తర్వాత పవన్ తో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ ఆల్రెడీ లైన్ లో ఉన్నట్లు రివీల్ అయింది.

ఇప్పుడు పవన్ చేయాల్సిన ఓ సినిమా రామ్ చరణ్ చేస్తున్నాడనే న్యూస్ ఒకటి బయటకురావడం హాట్ టాపిక్ అయింది.

ఇప్పుడంటే అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు గానీ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. అప్పట్లోనే ఇలాంటి మూవీస్ తీశాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' సినిమా తీస్తున్నాడు. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.

దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయం బయటపెట్టారు.

శంకర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు.. పవన్ కల్యాణ్ ని హీరోగా అనుకున్నారట. కానీ దిల్ రాజు సూచన మేరకు చరణ్ కి వినిపించారట.

రామ్ చరణ్ కు స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ లాక్ అయిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఒకవేళ పవన్ కల్యాణ్ ఈ మూవీ చేసి, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టైంలో ఇది గనక రిలీజ్ అయ్యింటే వేరే లెవల్ ఉండేదేమో!

మరి పవన్ కల్యాణ్ చేయాల్సిన సినిమాలు రామ్ చరణ్ హీరోగా నటిస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.