టాలీవుడ్ లో అత్యంత సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజును చెప్పుకోవచ్చు. 

విజయాలతో పాటు అపజయాలను కూడా ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు దిల్ రాజు. 

డిస్ట్రిబ్యూటర్​గా కెరీర్​ను ఆరంభించిన ఆయన.. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారారు. 

‘దిల్’ సూపర్ హిట్ అవ్వడంతో ఆ చిత్రం పేరు ఆయనకు స్థిరపడిపోయింది. 

కుటుంబ ప్రేక్షకులతోపాటు యూత్, మాస్ ఆడియెన్స్​కు మెచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు దిల్ రాజు.

కమర్షియల్ సినిమాలను తీస్తూనే ‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బలగం’ లాంటి పూర్తి కుటుంబ కథా సినిమాలనూ ప్రొడ్యూస్ చేసి హిట్లు కొట్టారు దిల్ రాజు. 

టాలీవుడ్​లో దిల్ రాజు అంటే ఒక బ్రాండ్​లా స్థిరపడిపోయింది. ఆయన పేరు ఉంటే థియేటర్​కు వెళ్లే ఆడియెన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. 

ఒక కథను ఓకే చేస్తే అది తెర పైకి వచ్చే వరకు దర్శకుడితో ట్రావెల్ చేయడం, పక్కా ప్లాన్​తో అనుకున్న బడ్జెట్​లో తీయడం దిల్ రాజ్ స్టయిల్.

పక్కా ప్లానింగ్​తో సినిమాలు తీస్తారు, కథల జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టి.. దిల్ రాజుకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే  ఉంది. 

అయితే ఇన్నేళ్ల కెరీర్​లో ఒక సినిమా దిల్ రాజును భారీగా దెబ్బతీసిందట. అదే ‘శాకుంతలం’. 

స్వయంగా దిల్ రాజు ఈ విషయాన్ని రీసెంట్​గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

25 ఏళ్ల సినీ కెరీర్​లో తనకు ‘శాకుంతలం’ పెద్ద జర్క్ ఇచ్చిందన్నారు దిల్ రాజు. 

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ను సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఈ మూవీని నీలిమా గుణ ప్రొడ్యూస్ చేశారు.

‘శాకుంతలం’ కథ నచ్చడంతో మూవీ నిర్మాణంలో దిల్ రాజు భాగమయ్యారు. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు. 

అలాగే మూవీని ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా డిజాస్టర్​ కావడంతో దిల్​ రాజుకు భారీ నష్టాలు తప్పలేదు.