దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు  కేంద్ర ప్రభుత్వం  తీవ్రంగా కృషి చేస్తుంది.

ఈక్రమంలోనే డీజిల్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ సూచనలు చేసింది.

10లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్‌ ఆధారిత వాహనాలను 2027 నాటికి నిషేధించాలని పేర్కొంది

వాటి స్థానంలో విద్యుత్, గ్యాస్ ఆధారిత వాహనాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

'ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌తో తయారైన వాహనాల తయారీని నిలిపివేయాలని కమిటీ సూచించింది.

ఆ వాహనాల తయారీ కూడా 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలని  కమిటీ తెలిపింది.

చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్‌ కపూర్‌ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి కీలక సూచనలు చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలోకి అదుబాటులోకి వచ్చేలోపు చమురులో ఇథనాల్ ను కలిపే వాటాను పెంచమంది.

ఫోర్ వీలర్ల వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడిపే విధంగాను చూడాలని కమిటీ పేర్కొంది.

అలానే మిగిలిన 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగాను  మార్చాల్సిన అవసరం ఉంది.

డీజిల్ తో నడిచే వెహికల్స్ ను వీలైనంత త్వరగా తప్పించాలని కమిటీ తన నివేదికలో  పేర్కొంది.

ఈవీలోకి మారే వరకు సీఎన్ జీ ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది.

ఫేమ్ సబ్సిడీ పొడిగింపునూ పరిశీలించాలని కేంద్రానికి కమిటీ సమర్పించిన రిపోర్ట్ లో పేర్కొంది.

ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్‌ నెట్‌ జీరో  చేస్తుందని నివేదిక పేర్కొంది.