గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్స్ ట్రై చేసారా ?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పోతే..  మరో ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని  ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టొచ్చు.  పోయిన ఫోన్ లో ఉన్న  మెయిల్ ఐడి తో ఈ యాప్ లోలాగిన్ అవ్వాలి.

ఫైండ్ మై డివైస్

 సౌండ్ సామర్థ్యం ఒక్కో మొబైల్ లో ఒక్కోలా ఉంటుంది. అయితే,  ఈ యాప్ మొబైల్ ఆడియోను మరింత మెరుగుపరుస్తుంది.  అనవసరమైన శబ్దాలను తొలగించి.. చక్కటి సంగీతాన్ని వినిపిస్తుంది.

సౌండ్ అంప్లిఫైయర్

పాత ఫొటోలను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది ఈ ఫొటో స్కాన్ యాప్. స్కాన్ చేసిన ఫొటోను యాప్ ఆటోమెటిక్ గా క్రాప్ చేసి, మెరుగులు దిద్దుతుంది.

ఫొటో స్కాన్

ప్రతి రోజు చేసే పనుల్ని బటన్ల రూపంలో మార్చుకొని మొబైల్ హోం స్క్రీన్లో పెట్టుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ సహాయంతో నడిచే ఈ యాప్.. మీరు నొక్కిన బటన్లను బట్టి పనిచేసుకుంటూ పోతుంది.

యాక్షన్ బ్లాక్స్

గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ని  ఈ యాప్ మేనేజ్ చేస్తుంది.  డ్రైవ్ లో లభించే ఉచిత 15 జీబీ కాకుండా మీకు అధిక క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే ఈ యాప్ లో పొందొచ్చు. మీ మొబైల్ లోని ఫోటోలు, ఇతర వివరాలను ఆటోమెటిగ్గా బ్యాక్ ప్ అయ్యేలా చూస్తుంది.

వన్

మీరు చేసే పనుల్ని ఈ యాప్ ట్రాక్ చేస్తుంది.  రోజులో ఎంత సేపు  పడుకున్నారు, ఎన్ని కెలోరీలు ఖర్చు చేశారు. ఎంత దూరం నడిచారు వంటి వివరాలను నమోదు చేస్తుంది.

గూగుల్ ఫిట్

ఈ యాప్ లో కార్టూన్లను సృష్టించి.. వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక కార్టూన్ కథను మీరే సృష్టించుకోవచ్చు. కార్టూన్లకు మీ ముఖాన్ని జోడించే ఆప్షన్ కూడా ఉంది.

టూంటాస్టిక్ 3డీ

గూగుల్ స్నాప్ సీడ్ అనేది ఒక ఇమేజ్ ఎడిటింగ్ యాప్ ఈ  యాప్ ప్లే స్టోర్ లో ఫ్రీగా లభిస్తుంది. 

స్నాప్ సీడ్

  ఈ యాప్ ద్వారా ఒక ఇమేజ్ కు సంబంధించిన వివరాలను గూగుల్ లో అన్వేషించొచ్చు. లేదా ఆ ఇమేజ్ ను పోలిన ఇమేజెస్ పొందవచ్చు. ఇమేజ్ లోని టెక్ష్ట్స్  ను కాపీ చేసుకోవచ్చు.  క్యూఆర్, బార్ కోడ్ ని  స్కాన్ చేయొచ్చు.

గూగుల్ లెన్స్

ప్రతి ఫోన్ లోనూ ఫైల్ మేనేజర్ ఉంటుంది. అయితే, గూగుల్ ఫైల్స్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

ఫైల్స్

 గూగుల్ సర్వే బృందం ఆవిష్కరించిన యాప్ ఇది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వివరాలు నమోదు చేస్తే.. వారానికోసారి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానం చెబితే.. రూ. 32.20 మీ గూగుల్ ప్లే క్రెడిట్లో జమ అవుతాయి.

ఓపీనియన్ రివార్డ్స్