కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేయాలి. 

అలాంటి వారి కోసం శాస్త్రం కొన్ని సులభంగా ఆచరించే ఉపాయాలు చెప్పింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమికి ముందు అంటే కార్తీక శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు మూడురోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.

అప్పుడే స్నానం చేసి, దీపారాధనకు తోడు దేవతారాధన చేయడం పరనింద, అసత్యం మాట్లాడకుండా ఉండటమే త్రికార్తీక వ్రతం.

ఈ మూడు రోజుల పాటు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. 

బ్రహ్మచర్యం, తలకు శరీరానికి నూనె పెట్టడం, శనగపప్పు, మాంసాహారం మానేయాలి.

కార్తీకమాసంలో మధ్యాహ్న నిద్ర పూర్తిగా మానేయాలి. నేలపై మాత్రమే నిద్రించాలి.

ఇలా చేస్తే కార్తీకమాసం మొత్తం స్నాన, దీపారాధన చేయాలేని వారికి ఇదో వరం.

శాస్త్రవచనం ప్రకారం త్రయోదశి రోజు వ్రతం పాటించేవారికి పవిత్రత కలుగుతుంది.

చతుర్దశి రోజు వ్రతంతో యజ్ఞాలు, దేవతల ద్వారా సాధకులు పవిత్రులవుతారు.

పౌర్ణమి రోజు వ్రతం వల్ల శ్రీ మహావిష్ణువు పవిత్రతని ప్రసాదిస్తారు.

కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు త్రయోదశి నుంచి వ్రతం చేయండి. భగవంతుడి అనుగ్రహం పొందండి.