త్రేతాయుగ ఆది పురుషుడు శ్రీరాముడు. ఆయనకు అపర భక్తుడు హనుమంతుడు.

హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో ఆరాధిస్తారు.

ఈ నెల 6న దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తి, శ్రద్ధలతో  భక్తులు నిర్వహిస్తారు.

అయితే ఏడాదిలో హనుమాన్ జయంతిని భక్తులు ఏటా రెండు సార్లు జరుపుకుంటారని తెలుసా..? ఎందుకు..? ఎప్పుడెప్పుడు జరుపుకుంటారంటే..?

హిందూ మత పంచాంగం ప్రకారం హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. 

 ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.

కొంతమంది ఆంజనేయ స్వామి భక్తులు అతని జన్మదినాన్ని కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున అని పరిగణిస్తారు. 

అంజనీ సుతుడు పుట్టిన రెండు తేదీలను చూస్తే.. ఏ రోజు వేడుకలు చేసుకోవాలన్న సందేహం కలగక మానదు.

హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

హనుమంతుడు పుట్టిన ఒక తేదీని ఆయన జన్మదినోత్సవంగా జరుపుకుంటే.. మరో తేదీని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.

హిందూ మతానికి సంబంధించిన గ్రంధాల ప్రకారం..  హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు మేషరాశిలో జన్మించాడు. 

నిజానికి..  హనుమంతుడు పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒకసారి చిన్నారి హనుమాన్ సూర్యుడిని చూసి.. ఫలమనుకుని భావించి దాన్ని తినేందుకు ప్రయత్నించాడు. 

 పండుగా భావించి తినబోతుండగా, దేవేంద్రుడు ప్రత్యక్షమై.. హనుమంతునిపై దాడి చేశాడు. దీంతో అప్పుడు ఆ చిన్నారి హనుమాన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఈ విషయం తెలిసి వాయు దేవుడికి కోపం వచ్చిందట.. అప్పుడు వాయుదేవుడు కోపంతో.. గాలి ప్రవాహాన్ని నిలిపివేశాడు. 

అప్పుడు మొత్తం విశ్వం స్థంభించిపోయింది. దీనిని నివారించడానికి.. దేవతలందరూ కలిసి సహాయం కోసం బ్రహ్మ దేవుడి వద్దకు వెళతారు.

అప్పుడు బ్రహ్మ స్వయంగా, ఇతర దేవతలతో కలిసి వాయుదేవుని వద్దకు వెళ్లి మళ్లీ జీవం పోశాడు. రెండవ జీవితాన్ని ఇస్తాడు. 

అంతేకాదు.. ఇతర దేవతలందరూ తమ శక్తులను చిన్నారి హనుమాన్ కి ఇస్తారు. ఈ రోజున హనుమంతుడు రెండవ జీవితాన్ని పొందాడు. 

అతనికి రెండవ జన్మ లభించిన రోజు చైత్ర మాసం పౌర్ణమి కాబట్టి.. అప్పటి నుండి హనుమాన్ జయంతిని ఈ తేదీన కూడా జరుపుకుంటారు.