మాంసాహారం కన్నా కూరగాయల భోజనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో రకాల విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు ఉండటం వల్ల రోగాల బారిన పడకుండా కాపాడతాయి.
వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికి మధుమేహులు మాత్రం కొన్ని రకాల కూరగాలయు తీసుకోకూడదు.
డయబెటిక్ పేషెంట్లు అస్సలు తినకూడని కూరగాయల్లో బంగాళదుంప ముందు వరుసలో ఉంటుంది.
వీటిలో పిండిపదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ సూచిక ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఇది షుగర్ పేషెంట్లకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మొక్కజొన్న వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా సరే.. దీన్ని డయాబెట
ీస్ పేషెంట్లు మాత్రం అసలే తినకూడదు.
ఎందుకంటే మొక్కజొన్నలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ 52గా ఉంటుంది.
బఠాణీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలానే పిండి పదార్థాలు కూడా
ఎక్కువగానే ఉంటాయి.
అందుకే మధుమేహులు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంద
ి.
ఇదే కాక వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 గా ఉంటుంది. అందుకే డయాబెటీస్ రోగులు బఠాణీలను తినకూడదు.
టమాటాలు ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా వీటిలో తీపి కూడా ఉంటుంది.
అందుకే మధుమేహులు పచ్చి టమాటాలను అసలే తినకూడదు. వంటల్లో కూడా మితం
గానే వినియోగించాలి.
అరటికాయను కూడా వివిధ రకాల కూరలు చేయడానికి ఉపయోగిస్తుంటారు.
అయితే అరటిలో కూడా ఎక్కువ మొత్తంలో తీపి, పిండిపదార్థాలు ఉంటా
యి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
అందుకే డయాబెటీస్ పేషెంట్లు అరటికాయను తినకూడదు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి