వేసవి కాలం వచ్చేసింది. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉన్నా తర్వాత మళ్ళీ ఎండలు మండిపోతాయి.
అయితే ఈ వేసవిలో మధుమేహులు కూల్ డ్రింకులు, షర్బత్ లు, జ్యూస్ లు ఎక్కువగా తాగుతుంటారు.
అయితే ఇవి షుగర్ పేషెంట్లకు విషంతో సమానం అని నిపుణులు అంటున్నారు.
వేసవికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలంటే కూల్ డ్రింకులకు బదులు ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తగినంత నీరు తాగడం వల్ల రక్తంలోని అదనపు గ్లూకోజ్ యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
శరీరంలో వేడి తగ్గించుకోవడానికి, చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంచుకోవడానికి సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యమని అంటున్నారు.
వేసవి కాలంలో షుగర్ రోగులు నిమ్మరసం తాగితే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
నిమ్మరసం డీహైడ్రేషన్ ను దూరం చేస్తుంది. నిమ్మరసంలో చక్కెర కాకుండా.. నల్ల ఉప్పు వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చాలా మంది పండ్ల రసాలు తాగుతుంటారు. అయితే పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.
అందుకే వేసవి కాలంలో పండ్ల జ్యూస్ బదులు కూరగాయల జ్యూస్ తాగితే మంచిదని అంటున్నారు.
కూరగాయల రసం తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉండడంతో పాటు హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది.
వేసవిలో డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో గ్లోకోజ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్, హైపోగ్లైసెమిక్, నెఫ్రో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహులకు ఎంతో మేలు కలిగిస్తాయి.
కొబ్బరి నీళ్లలో అసంతృప్త కొవ్వులు ఉండవు. కార్బ్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
వేసవిలో మజ్జిగ తాగితే చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారు తాగితే ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మజ్జిగ తాగడం వల్ల హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మజ్జిగలో క్యాలరీలు, ఫ్యాట్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. సమ్మర్ లో మధుమేహులు మజ్జిగ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.