షుగర్ లెవల్స్ పెరిగితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఈ కారణంగా స్ట్రోక్ వస్తుంది.
షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు దెబ్బ తింటాయి. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే..
అదనపు ద్రవాన్ని, వ్యర్థాలను బయటకు పంపడం అనేది కిడ్నీలకు కష్టమవుతుంది.
దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య వస్తుంది. డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అందుకే షుగర్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచుకోమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే రక్తనాళాలు, నరాలకు నష్టం వాటిల్లుతుంది. లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని అందనివ్వదు.
దీని వల్ల లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది. లైంగిక జీవితం నాశనమవుతుంది. అంతేకాదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలానే టైంకి మందులు వేసుకోవాలి.
సమతుల్య ఆహారం తినాలి. ఆరోగ్యకరమైన బరువు కలిగి.. ఒత్తిడి లేకుండా ఉండాలి.
గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను, వైద్యులను సంప్రదించవలసినదిగా మనవి.