DRS కా బాప్ ధోని..  ధోని రివ్యూకి అంపైర్ కే మైండ్ పోయింది!

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే  మిస్టర్ కూల్.. ది ఫినిషర్.. జార్ఖండ్ డైనమెట్  లాంటి పేర్లు గుర్తుకు వస్తాయి.

ఇక ధోని అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు  దాగి ఉన్నాయి. వాటిల్లో నిశీత దృష్టి ఒకటి.. 

అవును ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే  అందులో తిరుగుండదు అని మనందరికి  తెలిసిన విషయమే. 

అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే  అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. 

అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే  ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. 

ఈ క్రమంలోనే మరోసారి తన రివ్యూ సత్తా  ఏంటో చూపించాడు మిస్టర్ కూల్. 

ముంబైతో జరిగిన మ్యాచ్ లో అంపైర్ వైడ్  ఇచ్చిన బాల్ కు రివ్యూ తీసుకుని డేంజరస్  బ్యాటర్ సూర్యకుమార్ ను పెవిలియన్ కు  పంపాడు.

సాంట్నర్ వేసిన ఎనిమిదో ఒవర్ 2వ బంతిని  స్వీప్ షాట్ ఆడబోయాడు సూర్య. అయితే  ఆ షాట్ కాస్తా మిస్ అయ్యింది. 

దాంతో బాల్ వైడ్ అనుకుని  అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. 

కానీ క్యాచ్ పట్టిన ధోని మాత్రం ఎంతో  కాన్ఫిడెంట్ గా అంపైర్ వైడ్ ఇవ్వగానే క్షణం  అలోచించకుండా రివ్యూ కోరాడు.

బంతిని రిప్లేలో చూడగా.. అది సూర్య గ్లౌవ్స్ కు  తగిలినట్లు డీఆర్ఎస్ లో తేలింది.  అంపైర్ తప్పు ఒప్పుకుని అవుట్ ఇచ్చాడు.