తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్’.

యువదర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని.. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు

సోషల్ మెసేజ్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు

సమాజంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ.. మంచి సందేశంతో సార్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది

ఫిబ్రవరి 17న తెలుగుతో తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ అయ్యింది.

ప్రీమియర్ షోస్ నుండే హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగాను అద్భుతాలు సృష్టిస్తోంది

ఈ సినిమాలో ధనుష్ బాలు పాత్రలో నటించాడు. కాగా.. ఆ పాత్రలో ధనుష్ నటనకు గాను ప్రశంసల వర్షం కురుస్తోంది

తెలుగులో మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసిన సార్.. తమిళంలో 'వాతి'గా బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతుంది

ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రూ. 36 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సెట్ అయ్యింది

గత 4 రోజులలో సార్/వాతి మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 56 కోట్లు గ్రాస్.. రూ. 29 కోట్ల షేర్ రాబట్టింది

మరో రూ. 7 కోట్లు షేర్ రాబడితే.. వరల్డ్ వైడ్ సార్ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది

ఇక తెలుగు వరకు చూస్తే.. 6 కోట్లకు రూ. 10 కోట్లు రాబట్టింది. అంటే.. ఆల్రెడీ సార్ తెలుగులో 4 కోట్ల ప్రాఫిట్ లో ఉంది.