ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఇంటి నిర్మాణం కోసం దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా, ఈ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమ జరిగింది. అతికొద్దిమంది బంధుమిత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధనుష్ తన ఇంటిని తల్లిదండ్రులకు కానుగా ఇచ్చారు.
అయితే, ఈ ఇంటిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది.
గతంలో రజినీకాంత్ ధనుష్ తల్లిదండ్రుల్ని అవమానించారట. అది కూడా పోయస్ గార్డెన్‌లోని ఇంట్లోనే ఇది జరిగిందట.
అందుకే ప్రతీకారంగానే ధనుష్ ఈ ఇంటిని కట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తేల్చిచెప్పారు.
అసలు అలా ఆలోచించటమే మూర్ఖత్వం అని మండిపడ్డారు.