సోషల్ మీడియా వాడకం పెరగడంతో ఎందరో ప్రతిభావంతులు వెలుగుతోకి వస్తున్నారు.
టాలెంట్ ఉన్న సింగర్స్, డ్యాన్సర్స్, యాక్టర్స్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
అలా సోషల్ మీడియాతో ఫేమ్ సంపాదించిన వారిలో దీప్తి సునైనా ఒకరు.
పెద్దగా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించారు దీప్తి.
అందం, నటన, డ్యాన్స్ వీడియోలతో యువతను కట్టిపడేశారు దీప్తి సునైనా.
ఒక రేంజ్లో ఫాలోవర్స్‌ను కలిగిన దీప్తి.. అందాల విందుకూ వెనుకాడదు.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు పెడుతూ అందర్నీ ఆకట్టుకుంటుందామె.
సోషల్ మీడియా లేని జమానాలో యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు దీప్తి.
బిగ్‌బాస్ తెలుగు షోతో తన పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారామె.
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించడం ద్వారా దీప్తి చాన్నాళ్లు వార్తల్లో నిలిచారు.
అయితే షన్నూకు ఆమె బ్రేకప్ చెప్పినట్లు ఆమధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు పెట్టారు. ఇదిలాఉండగా.. ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
తాను ప్రేమలో పడినట్లు స్వయంగా దీప్తి సునైనానే వెల్లడించారు. అయితే ఆమె ప్రేమలో పడింది ఎవరితో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
తాను పుస్తకాలతో లవ్‌లో పడ్డానని చెప్పుకొచ్చిందీ లవ్లీ బ్యూటీ. ఈ సందర్భంగా పెట్ డాగ్‌తో దిగిన క్యూట్ పిక్స్‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.