‘ఐపీఎల్ 2022’ సందడి మొదలైపోయింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.

కానీ, కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం వారి వ్యక్తిగాత కారణాల రీత్యా ప్లేయర్లను రిటైన్ చేసుకోలేదు.

ఆ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. చెప్పకనే చెప్పారు. వారిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకటి!

అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఫ్రాంచైజీ.. కొందరు రైజర్లను అయినా వేలంలో తీసుకోగలుగుతామని ఆశిస్తున్నాం.

అంటూ ట్వీట్ చేసింది. అందుకు డేవిడ్ వార్నర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

డేవిడ్ వార్నర్ ను రిటైన్ చేసుకోరని ముందే తెలుసు.. ఇప్పుడు అది అధికారికంగా చెప్పారు అంతే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

‘అందరికీ ధన్యవాదాలు… ఇన్నేళ్లుగా మీరు ప్లేయర్లు, టీమ్ కు అందించిన సపోర్ట్, చూపించిన అభిమానం మర్చిపోలేనిద.

మీరు చూపించిన ప్రేమానురాగాలను నేను, నా భార్య, నా కుటుంబం మాట్లలో చెప్పలేనిది. ఇంతకాలం అభిమానించిన అందరికీ ధన్యవాదాలు.

వార్నర్స్ ను ప్రేమించండి’ అంటూ డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐపీఎల్ 14లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ డేవిడ్ వార్నర్ ను నిర్లక్ష్యం చేయడం.

అతని ఫామ్ లేమిని ఎత్తి చూపి డగౌట్ కి కూడా రానీకుండా చేసింది. అందిరికీ తెలిసిందే. ఇప్పుడు డేవిడ్ వార్నర్ వేలంలో ఎంత పొందుతాడు అన్నదే ప్రధాన ప్రశ్న.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన వార్నర్ వేలంలో భారీగా పొందే అవకాశం ఉంది.

కచ్చితంగా ఏదొక ఫ్రాంచైజీకి వార్నర్ ను కెప్టెన్ గా చూస్తామనే ధీమా వ్యక్త పరుస్తున్నారు.